'హిందూపురంలోనే ఎఫ్సీ పాసింగ్ కొనసాగించాలి'

'హిందూపురంలోనే ఎఫ్సీ పాసింగ్ కొనసాగించాలి'

సత్యసాయి: హిందూపురంలోనే ఆర్టీవో ఎఫ్సీ పాసింగ్ కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం హిందూపురం ఎంజీఎం గ్రౌండ్ మైదానంలో ఆటో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. గత ఆరు నెలల కిందట హిందూపురం నుంచి ఎప్సీ పాసింగ్ పుట్టపర్తికి తరలించారని తెలిపారు. దీంతో ఎఫ్సీ రెన్యువల్ సమస్యలు ఏర్పడ్డాయన్నారు.