నిరసన వ్యక్తం చేస్తున్న రేవటిగూడ గ్రామస్తులు

పార్వతీపురం మండలంలోని పెదమరికి పంచాయతీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలోని బందుగాం బ్లాక్కు చెందిన కొండపై ఉన్న రేవటిగూడ అనే గిరిజన గ్రామంలో మౌలిక సదుపాయాలులేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ గ్రామాన్ని ఆంధ్రాలో ఉన్న పెదమరికి పంచాయతీలో కలిపి తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు.