ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

KMR: బీర్కూర్ మండలం దామరంచలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోర్లం హన్మాండ్లు(38) రెండేళ్లుగా కడుపులో నొప్పితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.