విజయవాడ చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

NTR: విజయవాడ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు చేశారు. ఏసీపీ దామోదర్ వివరాల ప్రకారం.. అశోక్ నగర్‌కు చెందిన జనార్ధన్ వివాహం నిమిత్తం శ్రీశైలం వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉండాల్సిన బంగారం చోరీ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 130 గ్రాములు బంగారం వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.