పది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

పది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

NRPT: కృష్ణ మండలం గుడేబల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు గ్రామ ఏడవ వార్డు సభ్యురాలు కావలి తాయమ్మ ఉచిత పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. విద్యార్థులు పదవ తరగతిలో మెరుగైన ఉత్తీర్ణత సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.