విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
KMR: విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి చెందిన ఘటన పిట్లం మండలం బుర్నాపూర్‌లో ఇవాళ చోటు చేసుకుంది. అయితే అదే గ్రామానికి చెందిన రైతు భూమా పోచయ్యకు చెందిన ఎద్దు పొలంలో మేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కి తగిలి అక్కడికక్కడే మరణించిందని బాధితుడు చెప్పారు. ఈ ఘటనతో రూ. 60 వేల ఎద్దు చనిపోయిందని రైతు వాపోయారు.