చండీగఢ్‌పై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

చండీగఢ్‌పై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

చండీగఢ్ చట్టాలను రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలనే ప్రక్రియపై.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ ప్రతిపాదన వల్ల చండీగఢ్ పరిపాలనా నిర్మాణం పంజాబ్–హర్యానా రాష్ట్రాలతో ఉన్న సాంప్రదాయిక సంబంధాల్లో ఏ మార్పూ ఉండబోదని ప్రకటించింది. సంబంధిత పక్షాలందరితో సంపూర్ణంగా చర్చించిన తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.