వివాహిత అదృశ్యం

మేడ్చల్: ఘట్కేసర్ పరిధిలో నందిని(24) అనే గృహిణి అదృశ్యమైంది. వెంకటేష్, నందిని దంపతులు వారి ముగ్గురు పిల్లలతో ఘట్కేసర్‌లోని కృష్ణ మార్ట్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలను వదిలి, ఎవరికి చెప్పకుండా ఈనెల 15 మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.