'ప్రకృతి వ్యవసాయ సాగుపై దృష్టి పెట్టాలి'
VZM: ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులు దృష్టి సారిస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ పేర్కొన్నారు. అలాగే భూసారానికి అనువైన పంటలను సాగు చేయడం వలన అధిక రాబడి వస్తుందని చెప్పారు. జాతీయ ప్రకృతి మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పార్వతీపురం మండలం బొండపల్లి గ్రామంలో మట్టి నమూనా సేకరణను ఆమె పరిశీలించారు.