VIDEO: డ్యాన్స్ వైరల్.. నర్సులు సస్పెండ్

VIDEO: డ్యాన్స్ వైరల్.. నర్సులు సస్పెండ్

E.G: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐటమ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసిన ఘటనలో నర్సులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సులు కొందరు ఐటమ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఘటనపై విచారణ జరిపి ముగ్గురు నర్సులను సస్పెండ్ చేశారు.