'దళితులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదు'

'దళితులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదు'

PPM: రాష్ట్రంలో ఎక్కడైనా దళితులను ఇబ్బందులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ పేర్కొన్నారు. శుక్రవారం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. 24 మంది దళిత రైతులను ఆయన కలుసుకొని ఆక్రమణకు గురైన తమ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు.