నిరుద్యోగ యువతకు శుభవార్త..!

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

BHPL: జిల్లాలో అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి ఇందిర తెలిపారు. ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు, సోలార్ పంపు సెట్ల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని యువతందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.