సోమందేపల్లిలో ఘనంగా శ్రీ కృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి హాజరయ్యారు. మంత్రి, ఎంపీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.