రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం
VZM: ప్రజల సమస్యల పరిష్కార కోసం రేపు(సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్జీదారులు తమ సమస్యలపై పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.