పరివర్తన లైఫ్ సెంటర్ చిన్నారులకు దుస్తుల పంపిణీ
నంద్యాల శివారులోని పరివర్తన లైఫ్ సెంటర్‌లో చిన్నారులకు లయన్స్ క్లబ్ సభ్యులు బుధవారం నూతన దుస్తులను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దుస్తులు అందిస్తామని, ఈసారి రోడ్డు మరమ్మతుల కారణంగా ఆలస్యమైందని సభ్యులు తెలిపారు. వ్యాధి నిరోధకశక్తి తగ్గిన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ తోడుంటుందని వారు పేర్కొన్నారు.