VIDEO: రహదారిపైనే వరి కుప్పలు
KMR: బిక్కనూర్ మండలం బస్వాపూర్ సింగిల్ విండో సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని 44వ జాతీయ రహదారిపై రోజుల తరబడి ఆరబెట్టవలసి వస్తుందని శనివారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతున్నారు.