VIDEO: సొసైటీ కాలనీలో కుక్కల స్వైర విహారం

VIDEO: సొసైటీ కాలనీలో కుక్కల స్వైర విహారం

WGL: GWMC 19వ డివిజన్ పరిధి సొసైటీ కాలనీలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా కాలనీలలో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల మనుషులపై కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బయటికి రావాలంటే మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులు జంకుతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని కుక్కలు బెడద తీర్చాలని కోరుతున్నారు.