VIDEO: జిల్లాలో పడకేసిన పారిశుద్ధ్యం

GNTR: గుంటూరు చుట్టుగుంట ప్రధాన రహదారి వద్ద డ్రైనేజీ పూర్తిగా నిండిపోయిందని స్థానికులు వాపోతున్నారు. మురికి కాలువ దుర్వాసనతో అనారోగ్యాల బారిన పడుతున్నామని.. ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.