రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్న బాధితులు

MHBD: కేసముద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో రోడ్డు విస్తరణ పనులను నిర్వహిస్తున్న ఎక్స్‌ట్రావెటర్ యంత్రాన్ని బాధితులు అడ్డుకొని నిరసన చేపట్టారు. అధికారులు 80 ఫీట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టగా.. 60 ఫీట్లకే రోడ్డు విస్తరణ పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను 60 ఫీట్లకు కుదించాలని బాధితులు కోరారు.