వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందించేందుకే కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. తాము రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.