VIDEO: కంచికచర్లలో పుచ్చకాయలకు పెరిగిన గిరాకీ
NTR: కంచికచర్లలో వేసవి తీవ్రత పెరగడంతో పుచ్చకాయలకు భారీ గిరాకీ పెరిగింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా పుచ్చకాయలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చిన్న పుచ్చకాయ ధర కూడా రూ.100కు పైగా విక్రయమవుతుండటంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులు ధరలు తగ్గించాలని కోరుతున్నారు.