థియేటర్లలో ఫ్రీ పార్కింగ్‌పై భారీ ఊరట

థియేటర్లలో ఫ్రీ పార్కింగ్‌పై భారీ ఊరట

TG: థియేటర్ల పార్కింగ్ విషయంలో ప్రేక్షకులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 GOను కోర్టు సస్పెండ్ చేసింది. ఇక మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందనే విషయం తెలిసిందే.