రోడ్డు వేయాలని వామపక్ష ప్రజాసంఘాల ఆందోళన
KRNL: కోడుమూరు టౌన్‌లో పాత బస్టాండ్ దర్గా నుంచి గూడూరు రోడ్డు వరకు తారు రోడ్డు వేయాలని సీపీఐ మండల కార్యదర్శి రాజు, సీపీఎం మండల కార్యదర్శి కె.రాజు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షాకీర్ అహ్మద్ ఇవాళ డిమాండ్ చేశారు. కోడుమూరులో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు చిన్నగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.