మహిళ డిగ్రీ కళాశాలలో మంచినీటి బోరు ఏర్పాటు
SRPT: మఠంపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో మంచినీటి అవసరాల కోసం తాగునీటి మోటారు బోరుని వేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశానుసారం ఆదివారం కళాశాల ఆవరణలో నూతన బోరును అధికారులు వేశారు. విద్యార్థులకు ఎలాంటి నీటి సమస్య రాకూడదనే ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించిందని సంబంధిత అధికారులు తెలిపారు.