'ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బదిలీ చేయడం అన్యాయం'

'ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బదిలీ చేయడం అన్యాయం'

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా 15 మంది సీనియర్ పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. శిక్షణ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం అధికార దుర్వినియోగం చేయటమేనని ధ్వజమెత్తారు. వేరే రాష్ట్రాల అధికారులను ఇక్కడకు తరలించడం వల్ల వారికి స్థానిక భౌగోళిక పరిస్థితులు, భాషపై అవగాహన ఉండదని పేర్కొన్నారు.