చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: ధర్మసాగర్ మండలానికి సంబందించిన 13 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు, 43 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసుకోవాలని, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుందామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.