పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

MDK: చిల్పిచేడ్ మండలం సిలంపల్లి వద్ద పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాపురం లక్ష్మణ్, జుకంటి లోకయ్య, మన్నె ప్రసాద్, యల్లయ్యగారి భూమ్ రెడ్డి పట్టుబడగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 4,750 నగదు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.