కనకమహాలక్ష్మిని దర్శించుకున్నవిదేశీయులు

కనకమహాలక్ష్మిని దర్శించుకున్నవిదేశీయులు

విశాఖ: ప్రజల ఆరాధ్య దైవమైన బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం ఉదయం తులసిదళార్చన సేవ ఘనంగా నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు పాల్గొని వేదమంత్రోచ్చారణల మధ్య తులసి దళాలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ప్రత్యేక పూజలో భక్తులతోపాటు కెనడా దేశీయులు పాల్గొన్నారు.