రేపు జిల్లాలో అప్రెంటిస్ మేళా
PPM: సాలూరుపట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతిలలో పలు కంపెనీల్లో అప్రెంటిస్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అప్రెంటిస్ చేసిన వారు ఉద్యోగాల కోసం రావచ్చని తెలిపారు.