'పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలి'
CTR: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో జనసైనికులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పుంగనూరులో గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.