పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

తూ.గో: బిక్కవోలు మండలం బలభద్రపురంలోని సబ్బెళ్ల బుల్లయ్య రెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామంలో ప్లాస్టిక్ నివారణ, తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు సంచులు వాడాలని, ప్లాస్టిక్ నివారించాలని నినాదాలు చేశారు.