రుషికొండ ఆలయం మూసివేత

రుషికొండ ఆలయం మూసివేత

VSP: చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం విశాఖ రుషికొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు సోమవారం ప్రకటించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణ సమయంలో స్వామివారి దర్శనాలు నిలిపివేస్తామని తెలిపారు. గ్రహణానంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.