'అభివృద్ధి పనులకు విపక్ష MLAలను పిలుస్తున్నాం'

'అభివృద్ధి పనులకు విపక్ష MLAలను పిలుస్తున్నాం'

TG: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే ప్రభుత్వం తమది కాదని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విపక్ష MLAలను కూడా పిలిచామని, గతంలో సీఎం వస్తుంటే ప్రతిపక్ష నేతలను అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ MLAలు లేకపోయినా అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. తమకు ఓటు వేస్తేనే పథకాలు ఇస్తామనడం లేదని అన్నారు.