దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్

దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్

కృష్ణా: పామర్రు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భాస్కర్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. జుజ్జవరం గ్రామంలో ఉంటూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి వద్ద నుంచి 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో పది బైక్‌లను రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.