పుతిన్ పర్యటనపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పుతిన్ పర్యటన భారత్‌కు చాలా కీలకం. ఈ స్నేహం చాలా పాతది, బలమైనది. రష్యాతో కొనసాగిస్తున్న స్నేహ, ద్వైపాక్షిక బంధాన్ని అమెరికా, చైనాతో కూడా భారత్ కొనసాగించాలి. మన ఆర్థిక వ్యవస్థను వేరే ఏ దేశం కోసం తనఖా పెట్టకూడదు' అని పేర్కొన్నారు.