రేపు విశాఖలో పాఠశాలలకు సెలవు
VSP: తుఫాన్ కారణంగా విశాఖ జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.