'మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుంది'
MBNR: మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. శనివారం హన్వాడ మండలం హేమ సముద్రం చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఛైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు.