జొన్నగిరి చెరువును పూర్తిగా నింపాలి: ఎమ్మెల్యే

జొన్నగిరి చెరువును పూర్తిగా నింపాలి: ఎమ్మెల్యే

2017లో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో 68 చెరువులకు నీరు నింపే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ గుర్తు చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 67 చెరువులు నిండగా, జొన్నగిరి ప్రాంతానికి చెందిన ఒక చెరువు ఇంకా పూర్తిగా నింపబడలేదని తెలిపారు. ఈ చెరువును కూడా త్వరలో నింపేలా చర్యలు చేపట్టాలని ఆయన అభ్యర్థించారు.