'పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం DMHO రవి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేలా పేదలకు వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు.