అంబేద్కర్‌కు నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే

అంబేద్కర్‌కు నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే

BDK: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అనేక బాటలు వేశారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఇల్లందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి BRS పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నివాళి అర్పించారు. వారి అడుగుజాడల్లోనే మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లు పాలన సాగించారని తెలిపారు.