రేపు ఉరవకొండ మండలంలో మంత్రి పర్యటన
ATP: ఉరవకొండ మండలం బూదిగవి గ్రామంలో రేపు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పయ్యాల కేశవ్ క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఇవాళ తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.