పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లిస్తాం: EO
రైల్వే కోడూరు పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలను రెండు రోజుల్లో చెల్లిస్తామని పంచాయతీ ఈవో వరప్రసాద్ తెలిపారు. శనివారం కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద తమ పెండింగ్ జీతాలను చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలియజేసి, అనంతరం వినతిపత్రం అందజేశారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.