నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో బర్త్‌డే వేడుకలు

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో బర్త్‌డే వేడుకలు

AP: దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ తిరుమలలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా  తిరుమలకు కేక్ తీసుకువచ్చి అతిథిగృహంలో కట్ చేశారు. ఈ వీడియోను మాధురి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం, కట్ చేయడం నిబంధనలకు విరుద్ధం. దీంతో ఈ వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.