నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: పటేల్

SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని వారి నివాసంలో నియోజకవర్గానికి చెందిన 11 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంజూరైన రూ.4,47,500ల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలు సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.