క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్ గుడ్‌బై

క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్ గుడ్‌బై

సౌతాఫ్రికా సీనియర్ ప్లేయర్ వాన్ డర్ డసెన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు X వేదికగా.. కెరీర్‌తో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. 2018 నుంచి సౌతాఫ్రికా తరఫున 18 టెస్టులు, 71 వన్డేలు, 57 T20లు ఆడిన డసెన్.. 6 సెంచరీలు, 33 ఫిఫ్టీలతో మొత్తంగా 4,968 రన్స్ చేశాడు. అలాగే IPL 2022లో RR తరఫున 3 మ్యాచుల్లో 22 రన్స్ చేశాడు.