చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది: ఎమ్మెల్యే

చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది: ఎమ్మెల్యే

NLG: గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామంలో చేనేత కుటుంబాలతో కలిసిమెలిసి జీవించటంతో చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. చేనేత సమస్యలపై ఒక నివేదిక తయారు చేసుకుని నేతన్నలను సీఎం దగ్గరికి తీసుకపోతానన్నారు. ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు