నానో యూరియాపై ఏవో అవగాహన

నానో యూరియాపై ఏవో అవగాహన

KMM: నానో యూరియా వినియోగంపై కూసుమంచి మండలం లింగారాంతండాలో ఏవో వాణి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ యూరియాలో 40 శాతం వరకు నత్రజని వినియోగ సామర్థ్యం ఉంటుండగా.. నానో యూరియాలో 85శాతం వరకు ఉంటుందన్నారు. దీనిని నేరుగా మొక్కపై పిచికారీ చేయడం వలన మొక్కకు నేరుగా నత్రజని అందుతుందని, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు.