ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే
JGL: బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు రఘునందన్ ఆధ్వర్యంలో 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌తో కార్యక్రమం చేపట్టి ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.