అది ఉగ్ర కుట్ర కాదు: డీజీపీ

అది ఉగ్ర కుట్ర కాదు: డీజీపీ

జమ్మూకాశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతిచెందారు. ఈ దాడిని తామే చేశామని జైషేకు అనుబంధ సంస్థ అయిన PAFF ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను జమ్మూకాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభావత్ ఖండించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందేనని వెల్లడించారు. పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా పేలుడు జరిగిందని స్పష్టం చేశారు.