VIDEO: ఇంద్రవెల్లిలో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర
ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం హనుమాన్ మాలధారులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ గల్లీ నుంచి ప్రధాన రహదారి మీదుగా ఈ యాత్ర ఉత్సాహంగా సాగింది. అనంతరం భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో మండల కేంద్రం భక్తిమయంగా మారింది.